Header Banner

నేనే అమ్మాయినైతే కమలహాసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకునేవాడిని! ఫన్నీ కామెంట్స్!

  Sat Apr 19, 2025 17:18        Cinemas

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటి వరకు తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా, డబ్బింగ్‌ మరియు రీమేక్‌ చిత్రాల ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. రజనీకాంత్ జైలర్‌ సినిమాలో చేసిన గెస్ట్‌ రోల్‌ వల్ల మరింతగా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రియల్‌ స్టార్ ఉపేంద్రతో కలిసి ఆయన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ '45' ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో ప్రఖ్యాత సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చెన్నైలో జరిగిన ఈ మూవీ తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దర్శకుడు అర్జున్ జాన్య, నిర్మాత రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, చెన్నై తన జీవితానికి ఎంతో ప్రత్యేకమైన స్థలం అని తెలిపారు. తాను అక్కడే పుట్టి, పెరిగి, చదివిన విషయాన్ని గుర్తు చేశారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి అవకాశం కూడా అక్కడినుంచే వచ్చిందని చెప్పారు. కమలహాసన్, అమితాబ్ బచ్చన్‌లను తన అభిమాన నటులుగా పేర్కొంటూ, “నేనే అమ్మాయినైతే కమలహాసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకునేవాడినని” హాస్యంగా వ్యాఖ్యానించారు. తన జీవన ప్రయాణంలో తల సర్జరీ, క్యాన్సర్ వంటి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, మళ్లీ కెమెరా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘45’ సినిమా భావోద్వేగాలు, యాక్షన్, మరియు సందేశంతో కూడిన సమగ్ర చిత్రమని తెలిపారు. గతంలో ఉపేంద్ర దర్శకత్వంలో శివరాజ్ కుమార్ నటించిన ‘ఓం’ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇది కూడా చదవండి

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #Shivarajkumar #Upendra #45TheMovie #PanIndiaFilm #ShivannaIsBack #RealStarUpendra